‘ ఫ్రీ ఫుడ్ కిచెన్ ’..సత్య సాయి ట్రస్ట్ వారి మరో అద్బుత పథకం

updated: April 1, 2018 09:00 IST

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవలు అమోఘం అని ఎవరైనా ఒప్పుకుంటారు. సత్యసాయిబాబా సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. అంతేకాకుండా ఆయన పుట్టిన గడ్డకు చేసిన సేవలు ఎవరూ మరువలేనివి. పుట్టపర్తిలో విశ్వవిద్యాలయాలు, వైద్యశాల, నీటి ప్రాజెక్టులు చేపట్టి సేవా భావం తన భక్తులలోనూ పెంపొందించారు.  ఆయన జీవించి ఉండగానే కాకుండా ఆయన స్వర్గస్తులైన తర్వాత కూడా అవి అలాగే నిరంతంరం సాగటం విశేషం. తాజాగా వారు ఫ్రీ ఫుడ్ కిచెన్ అనే పోగ్రామ్ ని ప్రారంభించటం జరిగింది.

శ్రీ సత్య సాయి సేవా ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమేష్ పాండ్య మాట్లాడుతూ...  ఫ్రీ ఫుడ్ కిచెన్  పోగ్రామ్ లో భాగంగా...ఆంధ్రప్రదేశ్,తెలంగాణాలలోని 16 ఎంపిక చేసిన ప్రభుత్వ వైద్యశాలలో మధ్యాహ్న,మరియు రాత్రి భోజనం ఉచితంగా ఏర్పాటు చేయటం జరుగుతుందని అన్నారు.  అయితే ఈ భోజనం..ఆయా హాస్పటిల్స్ లలో వైద్య నిమిత్తం చేరిన పేషెంట్స్ కు చెందిన అటెండెంట్స్ కు అందచేస్తారు. హాస్పటిల్స్ లో పేషెంట్స్ కు గవర్నమెంట్ ఆహారవసతి ఏర్పాటు చేస్తుంది. 

కానీ పేషెంట్స్ కోసం వచ్చే అటెండెన్స్ చాలా ఇబ్బంది పడతారు. పేషెంట్స్ ని వదిలి బయిటకు వెళ్లి ఆహారం తెచ్చుకోలేక, ఆర్దిక ఇబ్బందులతోనూ ఉంటారు. అటువంటివారికి ఈ స్కీమ్ వరప్రదాయిని అనే చెప్పాలి. త్వరలోనే ఈ  పధకాన్ని దేశమంతటా విస్తరించాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు. భగవాన్ సత్యసాయి యొక్క ప్రసంగాలతో  ప్రేరణపొందిన అనేకమంది వాలంటీర్స్ ఈ పధకం విజయవంతమవటానికి సహకరిస్తారు అన్నారు

comments