మీ చిన్నారికి గ్రహణం మొర్రా? డోంట్ వర్రీ , ఉచిత చికిత్స వివరాలు

updated: March 3, 2018 22:34 IST
మీ చిన్నారికి  గ్రహణం మొర్రా? డోంట్ వర్రీ , ఉచిత చికిత్స  వివరాలు

జన్యులోపంతో పుట్టుకతోనే ఏర్పడే గ్రహణం మొర్రి, పెదవి చీలిక(క్లెఫ్ట్ లిప్ జబ్బు)తో బాధపడే చిన్నారులకు బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.  జన్యుపరంగా వచ్చే క్లెఫ్ట్ జబ్బుతో బాధపడే చిన్నారులకు బసవతారకం స్మైల్ ట్రైన్ సెంటర్(బీఎస్‌టీసీ) ద్వారా ఎంతో కాలంగా ఉచిత చికిత్స అందిస్తున్నామని హాస్పటల్ వర్గాలు తెలియచేసాయి.

 

 గ్రహణం మొర్రి శస్త్రచికిత్స నిపుణుడు డి.ముకుందరెడ్డి మాట్లాడుతూ... ఈ సమస్యకు సర్జరీ ద్వారానే పరిష్కారం లభిస్తుందన్నారు. ఆరు నుంచి ఏడాది వయసులోపు ఉన్న చిన్నారుల్లో సర్జరీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ వ్యాధిపై గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు ఉన్నాయని, వాటిని దూరం చేసి శస్త్రచికిత్స చేయించుకునేలా అవగాహన కార్యక్రమాలు రూపొందించామన్నారు

comments